ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్న నేను

 

ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్న నేను 

ఉన్నత పిలుపునకు బహుమానం పొందవలెనని 

1. ఏవేవి లాభకరమై ఉండెనో-వాటిని క్రీస్తు నిమిత్తం 

నష్టముగా నెంచుకొని-ముందుకే సాగుచున్నాను||ప్రభువా|| 

2. క్రీస్తును సంపాదించుకొని -తన పునరుత్ధాన బలమును 

ఎరిగి ఆయన శ్రమలలో-పాలివాడనగుదున్||ప్రభువా|| 

3. క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్ఠమైన -జ్ఞానం నిమిత్తం 

సమస్తమును నష్టముగా -ఎంచుకొనుచున్నాను||ప్రభువా|| 

4. వెనుక నున్నవి మరచి –ముందున్న వాటి కొరకై 

వేగిర పడుచు ధైర్యముగా –ముందుకే సాగుచున్నాను||ప్రభువా||