ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం

 

ప్రభువా… కాచితివి ఇంత కాలం 

కాచితివి ఇంత కాలం 

చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2) 

నీ సాక్షిగా నే జీవింతునయ్యా         ||ప్రభువా|| 

 

కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా 

మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2) 

నన్ను వలచావులే – మరి పిలిచావులే (2) 

అరచేతులలో నను చెక్కు కున్నావులే (2)       ||ప్రభువా|| 

 

నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా 

ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2) 

పాపము కడిగావులే – విషము విరచావులే (2) 

నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2)       ||ప్రభువా|| 

 

బాధలను బాపితివి నీవేనయ్యా 

నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2) 

నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2) 

నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2)       ||ప్రభువా||