ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను

 

ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా  నిండెను 

1.అపరాధములచే ప్రజలందరును – దేవుని మహిమను కోల్పోయిరి 

తన మహిమను మనకిచ్చుటకు – యేసుప్రభువే బలియాయెను 

2.కృపాసత్యములు సంపూర్ణముగా – మన మధ్యలో వసించెను 

తండ్రి మహిమను తన సుతునిలో – మన మందరము చూచితిమి 

3.ప్రభువు ఇంటిని నిర్మించుచుండె – సజీవమైన రాళ్ళతో 

ఆయన మహిమ దాని యందుండ – తన సంకల్పమైయున్నది 

4.శాంతిరాజు ఇల్లుకట్టుచున్నాడు – మానవ హస్తము అందుండదు 

క్రయమునిచ్చి స్థలము కొనెను – తాను కోరిన స్థలమదే 

5.ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటికి – తన పునాదిని వేసెను 

రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా – ప్రభువే సర్వము చేసెను 

6.సింహాసనముపై కూర్చున్న ప్రభువే – అణగద్రొక్కెను శత్రువును సంపూర్ణ జయముతో ఆర్భాటముతో – వెలిగించెను తన ఇంటిని 

7.దేవుని ఇల్లు ముగించబడగా – పైనుండి అగ్ని దిగివచ్చెను  

దహించబడును సర్వమలినము -ఇంటిని మహిమతో నింపును