ప్రపంచ సృష్టాదినామం అత్యున్నత మహోన్నతం

 

ప్రపంచ సృష్టాదినామం అత్యున్నత మహోన్నతం 

సృష్టిలోని అందాలె పాడు (ఓ) దేవా నీ సంకీర్తనం 

రాజులకు రాజువే నీవయా ప్రభులకు ప్రభువూ నీవెలే (2) 

ఎల్లకాలం నీదునామం కీర్తింతున్ (ఓ)నీవుమాకు సర్వశ్వము |ప్రపంచ| 

1.నీవాక్కుతో సృష్టినంత చేసావులె లెక్కలేనన్ని ప్రాణులతొ నింపావులె 

నీపోలికలొ నరులను చేసావులె నీ శ్వాసతో చెలిమిని పంచావులె 

సత్యదైవ పుణ్యనామం నీవేనని నిత్యము నిన్నుగూర్చి చాటించెదం(2) |రా 

 2.లోకమంత పాపంలొ పడయుండగ బూలోకానికే అరుదెంచావయ 

సిలువలో మాకైబలియైతివె నీవిలువతో మమ్ములను కొన్నావయా 

నిత్యజీవ మివ్వమాకు వెల్లావని సత్యమని విశ్వసించి సాగిపోదుము (2) |ప్ర |