ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే

 

ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే 

మంచి మనిషికిచ్చేది పద్మవిభూషన్ 

మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే 

జాతి గౌరవించిచ్చినది భారతరత్నే 

ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే 

శకపురుషుడు యుగపురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు 

1.అరిస్టాటిలున్నాడు ప్లేటో ఉన్నాడు 

అలెగ్జాన్డర్ అశోకుడు ఎందరో ఉన్నారు 

జ్ఞానులని అన్నారు రాజులని పిలిచారు 

చరిత్రలో చేరిగిపోని చిరంజీవులయ్యారు 

అధికారం ఎంతవున్నా అర్హులు కాలేదూ…. 

సర్వాధికారులైనా శకపురుషులు కాలేదూ….  

క్రీస్తే శకపురుషుడు క్రీస్తే యుగపురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు 

2.పరిచారం చేసాడు ప్రజల మధ్య ఉన్నాడు 

పాపులకై ప్రాణం పెట్టి రాక్షకుడే అయినాడు 

కులమే కుళ్ళని చెప్పి మతమే మత్తని చూపి 

మార్గాన్ని ప్రభోధించి 

మహానీయుడే అయినాడు 

కుడిచెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని 

క్రీస్తన్న మాటే గాంధీకి కదా నాందీ 

మహాత్ములకు మార్గం చూపి మహా జ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు