ప్రతిఉదయం నా మొదటిపాట నాప్రియ యేసునితో

 

ప్రతిఉదయం నా మొదటిపాట నాప్రియ యేసునితో 

మందమారుతాలతో మరుమల్లెలతో 

గొంతుకలిపి పాడినగీతం నాయేసునితో      (2) |ప్రతి 

1.ప్రతిదినమ నా మొదటి అడుగు నాప్రియ యేసునితో (2) 

కొండలైనా లోయలైనా పొంగిపారు ఏరులైన (2) 

వెంట ఉండి నడిపించే నా యేసునతో        (2) :ప్రతి: 

2.ప్రతిదినము నా మొదటి మాట నాప్రియ యేసునితో (2) 

సమయోచిత జ్ఞానమిచ్చి సరియగు ఆలోచనచెప్పి (2) 

నిజమగు నా స్నేహితుడు నా యేసునితో  (2) :ప్రతి: