పోరాటం ఆత్మీయ పోరాటం

 

పోరాటం ఆత్మీయ పోరాటం (2) 

చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు 

సాగిపోవుచున్నాను 

సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) 

 

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను 

అపజయమే ఎరుగని జయశీలుడాయన (2) 

నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2) 

ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం|| 

 

నా యేసు వెళ్ళిన మార్గము లేనని 

అవమానములైనా ఆవేదనలైనా (2) 

నా యేసు కృపనుండి దూరపరచలేవని (2) 

ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం|| 

 

ఆదియు అంతము లేనివాడు నా యేసు 

ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2) 

ఆ సింహాసనం నా గమ్యస్థానం (2) 

ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||