పొందితిని నేను ప్రభువా నీ నుండి

 

పొందితిని నేను ప్రభువా నీ నుండి 

ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2) 

 

జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2) 

ఇంత వరకు నాకు తోడై యుండి (2) 

ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2) 

నా రక్షణ కర్తవు నీవైతివి (2)                        ||పొందితిని|| 

 

గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2) 

అంధకార శక్తుల ప్రభావమునుండి (2) 

నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2) 

నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2)                       ||పొందితిని|| 

 

కష్ట దుఖంబులు నాకు కలుగగా (2) 

నను చేరదీసి ఓదార్చితివే (2) 

భయ భీతి నిరాశల యందున ప్రభువా (2) 

బహుగా ధైర్యంబు నాకొసగితివి (2)                ||పొందితిని|| 

 

నా దేహమందున ముళ్ళు నుంచితివి (2) 

సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2) 

వ్యాధి బాధలు బలహీనతలందు (2) 

నీ కృపను నాకు దయచేసితివి (2)                ||పొందితిని|| 

 

నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2) 

కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2) 

కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2) 

జయజీవితము నాకు నేర్పించితివి (2)          ||పొందితిని||