పేద నరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలచే

 

పేద నరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలచే -అంగీకరించు మాయనను 

1.కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె-ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడె  

నింద వేదన శ్రమలను సహించె నేసు-చిందె తనదు రక్తము నీ పాపముకై  దీనుడై నిన్ను పిలచుచుండె ||పేద|| 

2.తలవాల్చుట ఇల స్థలమేలేదు-దప్పి తీర్చుకొన దొరకలేదు  

తన్ను ఆధరించు వారెవరు లేరు-ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే  

పాట్లుపడే నన్ను విడిపింపను ||పేద|| 

3.ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్-పాపడాగులన్ రక్తముతో కడిగెన్.  

నీ వ్యాధి వేదన తొలగించ -నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందె||పేద|| 

4.మాయలోకమును నీవు నమ్మకుము -మనుష్యుల మనస్సు మారిపోవు నిల    

నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు-నిశ్చయముగా  

ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసంతో ||పేద|| 

5. తామసించెద  వేల ప్రియుడా-ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము    

ఈలోకము నీకివ్వని శాంతిని -ఈ దినమే ప్రభువు నీకొసగ ప్రేమతో నిన్ను పిలచుచుండె