పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే

 

పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే(2) 

1. ఏర్పరచు కోలేదు నేను ప్రభువే నన్ను ఏర్పరుచుకొనెన్(2 

పాపినైన నాకు ఆయనే రక్షణ నిచ్చెన్(2) 

పరలోక రాజ్యములో భాగము నిచ్చెన్(2)||పూర్ణ|| 

2. నా హృదయ పాపములను -తన రక్తములో కడిగెన్ 

మృతమైన నా ఆత్మను –జీవింపజేసే ప్రభు 

ఉచితంబుగానే పొందితి –నిత్యజీవం||పూర్ణ|| 

3. నే పాప బంధములో నుండ హృదయ శాంతితో నిండె 

నే పాపమొప్పుకొనగా-కడిగెను రక్తములో 

శాంతి ఆనందముతో-నన్ను నింపెన్||పూర్ణ|| 

4. వర్ణింప జాలను నేను ప్రభు గొప్ప ప్రేమన్ 

పాపిని నను ప్రేమించెన్ మారువలేనా ప్రేమను 

ప్రశంసలను పాడేదను ప్రభునకే||పూర్ణ|| 

5. నిత్య రాజ్యం నన్ను చేర్చ-నిత్య నిబంధన చేసే 

సుఖః దుఃఖములందైన-ముగింతు నాదు పరుగున్||పూర్ణ||