పూజించెదను పూజ్యనీయుడా

 

పూజించెదను పూజ్యనీయుడా 

నిజదైవమా రవితేజమా 

1. వెండి బంగారములు కోరలేదు నీవు 

నలిగిన మనస్సే అడిగినావు 

విలువైన వాసములు ఆశింపక నీవు 

నా హృదిలో ఉండగోరినావు 

2. ఏ కొండనో నిలచి అక్కడికి రమ్మనక 

నా చెంతకే వచ్చినావు 

నదులలో మునిగి శుద్దికమ్మనక 

నాలో జీవనదులుంచినావు 

3. దుష్టుడనైన నన్ను శిక్షకు గురిచేయక 

క్షమియించి రక్షించినావు 

ఒక్క నిముషమైనా నన్ను ఎడబాయక 

నాతో నుండే దేవుడవు నీవు