పిలచుచున్నాడు ప్రియమైన యేసు

 

పిలచుచున్నాడు ప్రియమైన యేసు 

పరిశుద్ధ స్థలమునకు ఎంత పాపివైనా 

ప్రేమించినాడు నీ జీవితమును 

ఏ భేదము లేక వేగమే రారండి 

నీవు నీ ఇంటి వారు నీతోనే ఉండువారు 

నిజమైన దేవుడని విశ్వసించుటకు ||పిలచు|| 

1.వెలుగై యున్నవాడు నీ చీకటి తొలగిస్తాడు 

మంచి గంధపు మాటలు నీ మదిలో కురిపిస్తాడు 

రా .. ఏ రోగివైననూ నీ పాపాలు కడుగును 

మారుమనస్సు పొంది ప్రేమ కలిగియుండి 

ప్రభుయేసు దేవుడని సాక్ష్యమిచ్చుటకు ||పిలచు|| 

2.మేడి చెట్టు ఎక్కి మరుగై యుండలేవు 

యేసు వచ్చు వేళ నిదురించకు ప్రభుని మరచి 

రా .. దిగి రమ్ము క్రిందకి ఏ అధికారివైననూ – యేసు నీ యింటికి  

వచ్చినేడే రక్షణ ఇచ్చి- పరలోక రాజ్యములో నిన్ను చేర్చుటకు ||పిలచు||