పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా

 

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) 

హల్లెలూయా – హల్లేలూయా (2) 

 

తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2) 

కడవరి చినుకులు పడగా పొలములో (2) 

ఫలియించెను దీవెనలే ||పావురమా|| 

 

అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2) 

సభకే జయమౌ ఉబికే జీవం (2) 

ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా|| 

 

బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2) 

వెలిగే వరమా ఓ పావురమా (2) 

దిగిరా దిగిరా త్వరగా   ||పావురమా||