పాపులమైన మమ్మును బ్రోవ పరమునుండి దిగివచ్చిన యేసూ

 

పాపులమైన మమ్మును బ్రోవ పరమునుండి దిగివచ్చిన యేసూ 

పరిమళించె నీ రాకతో ఈ భువి – పరమపితా వందనమిదిగో 

 

1. సర్వసృష్టిని తిలకించగను – సూర్యచంద్రులను పరికించగను 

నరుడనైన నా యెడల నీవు కృప చూపుటకు ఎంతటి వాడను 

 

2. బీదాలను ఆదరించగను – గ్రుడ్డివారికి చూపునివ్వగను 

మానవ రూపము దాల్చినదేవా – మహికి రక్షణ తెచ్చితివయ్యా 

 

3. ధరణిలోని ప్రేమలన్నియును -స్వార్థముతోనే నిండియుండును 

ఏ మంచిలేని నాకొరకై ఇలకు దీనుడవై దిగిన నీ ప్రేమ శాశ్వతం