పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో

 

పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో 

   నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో 

1. పాపము మోసితివే – నా శాపము బాపితివే 

    నీ మహిమకు పిలచితివే – నీకు స్తోత్రము యేసు ప్రభో 

2. చిందిన రక్తమున – నే పొందిన స్వస్థతను 

    రా నంటిని నీ దరికి – మన్నిచుము యేసు ప్రభో 

3. మంటిని యేసు ప్రభో – కనుగొంటిని నీకృపను 

    రా నంటిని నీదరికి – నను గావుము యేసు ప్రభో