పాతాళంలో ఆత్మల ఆర్తనాదం

 

పాతాళంలో ఆత్మల ఆర్తనాదం 

భూలోకంలో సువార్తల సునాదము (2) 

మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం 

ఎంచుకో స్వర్గం – నరకం (2) 

గమనించుకో ఎటు నీ పయనం         ||పాతాళంలో|| 

 

ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది 

విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది (2) 

రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ 

రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2)         ||పాతాళంలో|| 

 

ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది 

వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది (2) 

ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది 

ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది (2)         ||పాతాళంలో||