పాడెదదేవా నీ కృపలన్ – నూతన గీతములన్

 

పాడెదదేవా నీ కృపలన్ – నూతన గీతములన్ 

స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ 

1. భూమి పునాదులు వేకముందే యేసులో చేసితివి 

ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి-ఈ దీనుని బ్రోచితివి 

2.ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి 

ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి- నా పాపము తుడిచితివి 

3.పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి 

అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి 

ఈ ధర బ్రతికించితివి 

4. దేవుని రాజ్యపు వారసుడునిగా క్రీస్తులో చేసితివి 

చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి- 

చెర నన్ను విడిపించితివి 

5. ముద్రించితివి శుద్దాత్మతో నన్ను భద్రము చేసితివి 

సత్యస్వరూపి నిత్యనివాసి సోత్తుగా చేసితివి- నీ సొత్తుగా చేసితివి 

6.అన్యుడనై నిన్ను ఎరుగక యున్న నన్ను ధన్యుడిని చేసితివి 

ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములు నోసగితివి 

కృపా వరములు నొసగితివి