పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం

 

పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం 

నవ్వుకుంటూ దాటని ఎదురయ్యే  అవరోధం                                   

అలయక విసుగక పరుగును ఆపక                                  

కర్తయేసు నిన్ను చూస్తూ కదలనీ 

 

1.ఎండకు కాలి అరణ్యం ఇబ్బందిని కలిగించినా       

నిందకు చీలిన హృదయం ఆపశృతులే పలికించినా                   

వెనుతిరిగి చూడకుండ-వెనకడుగు వేయకుండ                     

ప్రార్థనే తోడుగా గమ్యమే చేరని  

 

2. గాలితుఫానుల ప్రళయం భయపెట్టాలని చూసినా      

ఓటమిచాయల గరళం స్వరగతులే మార్చేసినా 

3. ఉరికే నదుల ప్రవాహం మార్గం మూసివేసినా      

ఉరిమే శ్రమల ప్రభావం మాధుర్యం మింగేసినా