పసిబాలుడీతడని పవన వీవన వీచి

పసిబాలుడీతడని పవన వీవన వీచి 

లాలిపాటలు పాడనేల చిరుగాలి 

లాలి పాటలు చాలు స్తోత్రగీతికలల్లు 

బాలుడీతడు కాడు బలమైనవాడే 

 

1. పాల బుగ్గల పాపడీతడే గాని 

పాపాల భారంబు మోయగలవాడే 

మనుజాళి భారంబు మరి మోయగాదలచి 

మహిమ లోకము వీడి మహికి దిగినాడే 

 

2. పశులపాకను తాను పవళించియున్నా 

పసిడి పరలోకపు జనతైక సుతుడే 

నిశిరాతిరిని తాను ప్రభవించియున్నా 

నిఖిల జగతికి నీతి సూర్యుడుతండే