పరిశుద్ధ సింహాసనం -నీదు నివాస స్థలం

 

పరిశుద్ధ సింహాసనం –నీదు నివాస స్థలం 

ఈ భూమి నీ పాద పీటం-ఈ సృష్టి చేతి పనియే 

సెరాపులు కెరూబులు-పరిశుద్దుడు పరిశుద్దుడని 

చేయు ప్రతి గానములకు-నీవే యోగ్యుడవు 

2మార్గమును సత్యమును జీవమునైయున్న మా దేవా 

మా హృదయమే నీ ఆలయం-మాలోన వసియించు ప్రభువా 

అల్పయును ఒమేగయును –యుగయుగములకు సజీవుడవు 

ఆకాశం భూమి గతించినను నీవే మా దేవుడవు