పరిశుద్ధుడా పరమాత్ముడా దావీదు చిగురైన యేసు నామధేయుడా

 

పరిశుద్ధుడా పరమాత్ముడా దావీదు చిగురైన యేసు నామధేయుడా 

అ.ప: ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు  

మహిమయు నీకే ప్రభూ 

 

1.పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన  

ఓ దివ్యతేజుడాసుర్యకాంత పద్మరాగముల పోలియున్నవాడా గ్రంధమును విప్పగలిగిన సర్వసమర్ధుడా 

 

2. నీ రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మునుకొన్న ఓ జయశీలుడా రాజులైన యాజకులనుగా చేసియున్నవాడా 

మరణించి తిరిగి లేచిన గొప్ప బలాడ్యుడా 

 

3. భుతవర్తమాన భవిష్యత్ కాలమున జీవించుచున్న  

ఓ ప్రేమధారుడాసృష్టియంతా కలుగజేసి ఏలుచున్నవాడా జీవకోటిపూజ లందుకొను సత్యస్వరూపుడా