పరాక్రమము గల మహా రాజ్యుడా…

 

పరాక్రమము గల మహా రాజ్యుడా 

నీ కంటికి కనిపించే  

నీ చెవులకు వినిపించే.. 

దేనిని గురించి భయపడకు 

భయపడకు…(3) 

దహించు అగ్ని అయిన నీ దేవుడే 

నీనుండి వెళ్తుంటే భయమెందుకు 

నీకంటే బలమైన ఆ జనములు 

నీముందు నిలువలేరు పద ముందుకు. ఇకచేసుకో స్వాధీనం(3) 

చిన్.. చిన్.. చిందువేయి 

నీవలన భయము 

ప్రతి జన్మమునకు నీ 

ప్రభువు పుట్టించును… 

 

1.నీవు అడుగుపెట్టేటి ప్రతిస్థలమునకు… ప్రభు 

ఏనాడో నీకిచ్చెను 

ఈ భూమి మొత్తమే నీ సొత్తు చేసాడు.. 

లోపరచి ఏలేయను 

ఈ దేశ వైశాల్యం మంతను అడుగేసే ప్రభూజండ స్థాపించను.. 

చేసుకో స్వాధీనం(3) 

చిన్.. చిన్.. చిందువేయి 

 

2.దేశపు ఉన్నత స్థలముల పైన 

ప్రభు నిన్ను ఎక్కించును… 

పాడైన దాని పునాదులను ప్రభు నీ చేత పాటించును… 

తన రాజ మకుటంగా తన రాజ దండంగా నిన్ను నియమించును.. 

శాసనము స్థాపించు తన ముద్రను ఉంగరం నా ప్రభు నిన్నుంచేను..ను..ను 

ఇక చేసుకో స్వాధీనం(3) 

చిన్.. చిన్.. చిందువేయి 

 

3.నీ కొరకు ప్రభు తలంపులన్ని అత్యున్నతముగా ఉండును 

నీ శక్తికి మించిన కార్యములను ప్రభు నీ చేత చేయించును.. 

గుడార స్థలములను విశాల పరచింక 

కుడి ఎడమ వ్యాపించెను 

ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించెను..ను..ను.. 

చేసుకో స్వాధీనం..(3) 

చిన్.. చిన్.. చిందువేయి