పరవాసిని నే జగమున ప్రభువా

 

పరవాసిని నే జగమున ప్రభువా (2) 

నడచుచున్నాను నీ దారిన్ 

నా గురి నీవే నా ప్రభువా (2) 

నీ దరినే జేరెదను 

నేను.. నీ దరినే జేరెదను       ||పరవాసిని|| 

 

లోకమంతా నాదని యెంచి 

బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) 

అంతయు మోసమేగా (2) 

వ్యర్ధము సర్వమును 

ఇలలో.. వ్యర్ధము సర్వమును      ||పరవాసిని|| 

 

ధన సంపదలు గౌరవములు 

దహించిపోవు నీలోకమున (2) 

పాపము నిండె జగములో (2) 

శాపము చేకూర్చుకొనే 

లోకము.. శాపము చేకూర్చుకొనే     ||పరవాసిని|| 

 

తెలుపుము నా అంతము నాకు 

తెలుపుము నా ఆయువు యెంతో (2) 

తెలుపుము ఎంత అల్పుడనో (2) 

విరిగి నలిగియున్నాను 

నేను.. విరిగి నలిగియున్నాను        ||పరవాసిని|| 

 

ఆ దినము ప్రభు గుర్తెరిగితిని 

నీ రక్తముచే మార్చబడితిని (2) 

క్షమాపణ పొందితివనగా (2) 

మహానందము కలిగే 

నాలో.. మహానందము కలిగే        ||పరవాసిని|| 

 

యాత్రికుడనై ఈ లోకములో 

సిలువ మోయుచు సాగెదనిలలో (2) 

అమూల్యమైన ధనముగా (2) 

పొందితిని నేను 

యేసునే.. పొందితిని నేను       ||పరవాసిని|| 

 

నా నేత్రములు మూయబడగా 

నాదు యాత్ర ముగియునిలలో (2) 

చేరుదున్ పరలోక దేశము (2) 

నాదు గానము ఇదియే 

నిత్యము.. నాదు గానము ఇదియే       ||పరవాసిని||