పరవశించి పాడనా పరమ శిశువు జన్మను

 

పరవశించి పాడనా పరమ శిశువు జన్మను 

శిరమువంచి వేనా సిరుల బాలయేసును 

హాలేలూయా హాలేలూయా (2) 

 

1. కరములు జోడించి విరిగిన హృదయముతో వరసుతునికి పూజచేయనా 

పరలోకము వీడిన ఆ వరదుని ప్రేమను మరువకనే తలపోయనా 

 

2. ధరణీతలముపై నరుడై జన్మించిన పరమాత్ముని మదిని నిల్పనా 

కరుణలు కురిపించు ఆ కారణజన్ముని నిరతము ఇలనే చాటనా