పరమ యెరుషలేమా – పరిశుద్ధ భూషణాలతో

 

పరమ యెరుషలేమా – పరిశుద్ధ భూషణాలతో  

వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా  

ఆమెన్ హల్లెలూయ – ఆమెన్ హల్లెలూయ  

ఆమెన్ హల్లెలూయ – ఆమెన్ హల్లెలూయ  

1. నా గొర్రెలు నా స్వరము వింటాయి 

అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి – అన్నాడు ప్రభు యేసు 

అనుసరించు ప్రభు యేసుని ||పరమ|| 

2.రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని ప్రేమతోడ  

పిలచిన కోడిపోలి పిలిచాడు ప్రభు నిన్ను  

వెనుదియ్యకు ప్రభునుండి ||పరమ|| 

3. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచినా  

మరువవచ్చును ప్రభు నిన్ను మరువడు 

మరువవద్దు ప్రభు యేసుని ||పరమ|| 

4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో – శోధనలలో  

విశ్వాసం కాపాడుకో – ప్రభుకొరకు సిద్ధపడుమా గొర్రెపిల్ల జీవకన్యకా||పరమ||