పరమ జీవము నాకు నివ్వతిరిగి లేచెను నాతో నుండ

 

పరమ జీవము నాకు నివ్వ 

తిరిగి లేచెను నాతో నుండ 

నిరంతరము నన్ను నడిపించును 

మరల వచ్చి యేసు కొని పోవును 

 

యేసు చాలును – యేసు చాలును 

యే సమయమైన యే స్థితికైన 

నా జీవితములో యేసు చాలును 

 

సాతాను శోధనలధికమైన 

సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను 

లోకము శరీరము లాగినను 

లోబడక నేను వెళ్ళెదను             ||యేసు|| 

 

పచ్చిక బయలులో పరుండజేయున్ 

శాంతి జలము చెంత నడిపించును 

అనిశము ప్రాణము తృప్తిపరచున్ 

మరణ లోయలో నన్ను కాపాడును           ||యేసు|| 

 

నరులెల్లరు నన్ను విడిచినను 

శరీరము కుళ్ళి కృశించినను 

హరించినన్ నా ఐశ్వర్యము 

విరోధివలె నన్ను విడచినను        ||యేసు||