పరదేసి పుణ్య క్షేత్ర

 

పరదేసి పుణ్య క్షేత్ర  

యాత్ర బోవుచుందువా 

యేసు నాజ్ఞ తలపోసి 

మోక్ష మొందఁ బోదును 

కొండ లెక్కి యేళ్ళు దాటి  

మోక్ష రాజ్యం చేరుదాక 

ముందు పోవుచుందును 

ఒంటిగాను బోవుదువే 

నీకు భయ ముండదా 

లేదు నాకు భయమేల 

స్వామి నన్ను గాచును 

మోక్ష రాజ్యం చేరుదాక 

యేసు నాకు దోవ చూప 

ముందు పోవుచుందును 

3పరదేసి  మోక్షమందు 

నీకు లాభ ముండునా 

నిత్యానంద  సువిశ్రాంతి 

యందు నుండు లాభము 

జీవనది నీళ్లు త్రాగి 

యేసుతో సదా వసింప 

ముందు పోవుచుందును 

పరదేసి నీతో నేను 

యాత్ర చేయవచ్చునా 

రమ్ము  నాతో గూడా రమ్ము 

యేసు నిన్ను రమ్మనెన్ 

మార్గ యాసమైన నేమి 

మాకు మోక్షం చిక్కు వేళ 

సువిశ్రాంతి కల్గును