పదే పదే నేను పాడుకోనా-ప్రతిచోట నీ మాట నా పాటగా

 

పదే పదే నేను పాడుకోనా-ప్రతిచోట నీ మాట నా పాటగా 

మరీ మరీ నేను చాటుకోనా-మనసంత పులకించ నీ సాక్షిగా 

నా జీవిత గమనానికి గమ్యము నీవే-చితికిన నా గుండెకు రాగం నీవే….”2″”పదే” 

అ.ప.: మమతల మహరాజ యేసురాజా మమతల మహరాజ యేసురాజా “2″ 

1. అడగకముందే అక్కరలెరిగి-అవసరాలు తీర్చినా ఆత్మీయుడా- 

ఎందరు ఉన్నా బంధువు నీవే-బంధాలను పెంచినా భాగ్యవంతుడా    “2” 

అవసరాలు తీర్చినా ఆత్మీయుడా-బంధాలను పెంచినా భాగ్యవంతుడా  “2””మమతల” 

2. అలిగిన వేళ అక్కున చేరి-అనురాగం పంచిన అమ్మవు నీవే 

నలిగిన వేళ నా దరి చేరి-నమ్మకాన్ని పంచిన నాన్నావు నీవే 

అనురాగం పంచిన అమ్మవు నీవే-నమ్మకాన్ని పంచిన నాన్నవు నీవే “2″    “పదే”