పదివేలలో అతిసుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా

 

పదివేలలో అతిసుందరుడా 

మనోహరుడా మహిమోన్నతుడా (2) 

నీ నామం అతి మధురం 

నీ త్యాగం మహానీయం (2) 

 

తల్లిదండ్రుల కన్నను 

బంధు మిత్రుల కన్నను (2) 

ప్రేమించి నాకై నిలచే 

స్నేహితుడా ప్రాణ నాథుడా (2)        ||పదివేలలో|| 

 

నీ కొరకే యేసు నీ కొరకే (3) 

నా కరములెత్తెదను 

మోకరించి నా శిరము వంచి 

నా కరములెత్తెద నీ కొరకే (2) 

పరిశుద్ధ ఆత్మ రమ్ము (2) 

నను యేసు పాదము చెంత చేర్చుము 

పరిశుద్ధ ఆత్మ రమ్ము              ||నీ కొరకే||