పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడుఆ మోము

 

పదివేలలో అతిప్రియుడు 

సమీపించరాని తేజోనివాసుడు 

ఆ మోము వర్ణించలేము 

స్తుతుల సింహాసనాసీనుడు 

నా ప్రభు యేసు (4) 

 

ఏ బేధము లేదు ఆ చూపులో 

ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2) 

జీవితములను వెలిగించే స్వరం 

కన్నీరు తుడిచే ఆ హస్తము (2) 

అంధకారంలో కాంతి దీపం 

కష్టాలలో ప్రియనేస్తం (2) 

నా ప్రభు యేసు (2)         ||పదివేలలో|| 

 

దొంగలతో కలిపి సిలువేసినా 

మోమున ఉమ్మి వేసినా (2) 

తాను స్వస్థతపరచిన ఆ చేతులే 

తన తనవును కొరడాలతో దున్నినా (2) 

ఆ చూపులో ఎంతో ప్రేమ 

ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2) 

నా ప్రభు యేసు (2)          ||పదివేలలో||