పట పటమని పై కెగిరే సీతాకోకచిలుక – ఓ సీతాకోకచిలుక

 

పట పటమని పై కెగిరే సీతాకోకచిలుక – ఓ సీతాకోకచిలుక  

నీ రెక్కల్లో రంగులెన్నో చూడు – ఆ రంగులన్నీ నీకు పూసిందెవారు?(2) 

1.మొదట నేను గ్రుడ్డులాగ వుంటిని – పురుగువలె ఆకులపై నేనుంటిని  

నా చుట్టు గూడు కట్టి – ఆ ఇంటిలో నేనుంటి  

చాల దినములందు వేచియుంటిని – రెక్కలు రాగా నేను ఎగురుచుంటిని /పట/ 

2.నన్ను పోలి నీవును జీవించుము – దేవుని కొరకె నీవు వేచియుండుము  

నా చుట్టు తిరిగి చూడు – ఆయన చిత్తమేదో అడుగు 

క్రొత్త జీవమాయన నీకిచ్చును – ఆయన జీవమొందియే జీవింతువు /పట/