పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా

 

పంపుము దేవా  దీవెనలతో – పంపుము దేవా 

   పంపుము దయచేత – పతిత పావన నామ 

   పెంపుగ నీ సేవ – బ్రియ మొప్ప నొనరింప 

    పంపుము దేవా  దీవెనలతో – పంపుము దేవా 

 

1. మా సేవనుండిన – మా వెల్తులన్నియు 

    యేసుని కొరకు నీ వెసగ క్షమియించును 

 

2. వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి 

    దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప 

 

3. ఆసక్తితో నిన్ననిశము సేవింప 

    భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి