నే సాగెద యేసునితోనా జీవిత కాలమంతా

 

నే సాగెద యేసునితో 

నా జీవిత కాలమంతా (2) 

 

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) 

పరమును చేరగ నే వెళ్లెద (2) 

హనోకు వలె సాగెదా            ||నే సాగెద|| 

 

వెనుక శత్రువులు వెంటాడిననూ (2) 

ముందు సముద్రము ఎదురొచ్చినా (2) 

మోషె వలె సాగెదా             ||నే సాగెద|| 

 

లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) 

కఠినులు రాళ్ళతో హింసించినా (2) 

స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద|| 

 

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) 

క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) 

పౌలు వలె సాగెదా             ||నే సాగెద|| 

 

తల్లి మరచిన తండ్రి విడచిన (2) 

బంధువులే నన్ను వెలివేసినా (2) 

బలవంతుని వలె సాగెదా    ||నే సాగెద||