నేనెళ్లపుడు యెహోవాను సన్నుతించెదన్

నేనెళ్లపుడు యెహోవాను సన్నుతించెదన్(2) 

నిత్యముఆయన కీర్తి నా నోటనుండున్(2) 

అ.ప అంతా నా మేలుకే-ఆరాధన యేసుకే 

అంతా నా మంచికే-(తన చిత్తమునకు తల వంచితే)-(2) 

ఆరాధన ఆపను-స్తుతియించుట మానను(2) 

స్తుతియించుట మానను 

1.కన్నీళ్లే పానములైన-కఠిన ధుఃఖ భాధలైన 

స్థితిగతులే మారిన-అవకాశం చేజారిన 

మారదు యేసు ప్రేమ-నిత్యుడైన తండ్రి ప్రేమ(2) 

మారదు యేసు ఫ్రేమ-నిత్యుడైన తండ్రి ప్రేమ(2) 

2.సంకల్పాన పిలుపొంది-నిన్నే ఫ్రేమించు నాకు 

సమస్తము సమకూడి-మేలుకై జరుగును 

యేసుని సారూప్యము-నేను పొందాలన్ని(2) 

అనుమతించిన ఈ-విలువైన సిలువకై(2) 

3.నీవు చేయునది-నాకిప్పుడు తెలియదు 

ఇక మీదట నేను-తెలిసికొందును 

ప్రస్తుతము సమస్తము-దుఃఖ కరమే(2) 

అభ్యసించిన నీతి-సమాధాన ఫలమే(2) 

4.చదువులే రాకున్నా-ఓటమి పాలైన 

ఉద్యోగం లేకున్నా -భూమికే బరువైనా 

నా యెడల నీ తలంపులు-ఎంతో ప్రియములు 

నీవుద్ధేశించినది నిష్పలము కానేరదు(2)