నేను వెళ్ళేమార్గము – నాయేసుకే తెలియును

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును 

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)     ||నేను|| 

 

కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2) 

గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు 

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) 

 

జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2) 

అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు 

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) 

 

విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2) 

సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు 

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)         ||నేను||