నేనంటె నీకెందుకొ..ప్రేమ ..నన్ను మరచిపోవెందుకొ..


నేనంటె నీకెందుకొ..ప్రేమ ..నన్ను మరచిపోవెందుకొ..  

నా ఉసే నీకెందుకొ…ఓ యేసయ్యా నన్ను విడచిపోవెందుకోకష్టాలలో..నష్టాలలో…వ్యాధులలో … 

బాధలలో..కన్నీళ్ళలో..కడగళ్లలో…వేదనలో..శోధనలో.. 

నా ప్రాణమైనావు నీవు..ప్రాణమా..నా ప్రాణమా.. 

1.నిన్ను మరచిపొయిన…నన్ను మరచిపోలేవు..నిన్ను విడచివెళ్ళినా.. 

నన్ను వీడిపోలేవు..ఎందుకింత ప్రేమ నాపై యేసయ్య..  

ఎందుకింత ప్రేమ నాపై యేసయ్య..ఎ ఋణమొ..ఈ బంధమూ.. 

నా ప్రేమ మూర్తి..తాళలేను నీ ప్రేమను.. 

2. ప్రార్ధంచకపోయినా..పలకరిస్తూ  ఉంటావు ..మాట వినకపోయినా  

కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జాలి నాపై యేసయ్య … 

ఎందుకింత జాలి నాపై యేసయ్య …ఏ ఫలమో..ఈ బంధము.. 

నా ప్రేమమూర్తి ..తాళలేను నీ ప్రేమను..