నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచును

Lyrics 

నేడో రేపో నా ప్రియుడేసు 

మేఘాలమీద ఏతెంచును 

మహిమాన్వితుడై ప్రభు యేసు 

మహీ స్థలమునకు ఏతెంచును            ||నేడో రేపో|| 

 

చీకటి కమ్మును సూర్యుని 

చంద్రుడు తన కాంతినీయడు (2) 

నక్షత్రములు రాలిపోవును 

ఆకాశ శక్తులు కదిలిపోవును (2)         ||నేడో రేపో|| 

 

కడబూర స్వరము ధ్వనియించగా 

ప్రియుని స్వరము వినిపించగా (2) 

వడివడిగ ప్రభు చెంతకు చేరెద 

ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2)       ||నేడో రేపో|| 

 

నా ప్రియుడేసుని సన్నిధిలో 

వేదన రోదనలుండవు (2) 

హల్లెలూయా స్తుతిగానాలతో 

నిత్యం ఆనందమానందమే (2)               ||నేడో రేపో||