నేడు ఇక్కడ రేపు ఎక్కడోతెలియని పయనం ఓ మానవా

నేడు ఇక్కడ రేపు ఎక్కడో 

తెలియని పయనం ఓ మానవా (2) 

ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు 

ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2)         ||నేడు|| 

 

నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే 

నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2) 

నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2) 

నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు      ||నేడు|| 

 

అది నాది ఇది నాదని అదిరి పడతావు 

చివరికి ఏది రాదు నీ వెంట (2) 

దిగంబరిగానే నీవు పుడతావు 

దిగంబరిగానే నీవు వెళతావు (2)         ||నేడు||