నృపా విమోచకా ప్రభూ వేలాది నోళ్ళ

నృపా విమోచకా ప్రభూ

వేలాది నోళ్ళ నీ 

కృపా జయ ప్రభావముల్

నుతింతు నెంతయున్

2 కృపాధికార!దేవా నీ

సాయంబు జేయుమా

భవత్ప్రభావ  కీర్తులన్

జాటంగా నెల్లెడన్

3 భయంబు చింత బాపును

హర్షంభు పాపికి

సౌఖ్యంబు జీవ శాంతులు

నీ నామ మిచ్చును

4 విముక్తి జేయు ఖైదిని

పాపంబు బాపును

పాపాత్ము శుద్ధి జేయును

శ్రీ యేసు రక్తము

5 జనాళి పాపులెల్లరు

శ్రీ యేసున్ నమ్ముడి

కృపావిముక్తులందుండి

సంపూర్ణ భక్తితో

5అర్పించే యేసు ప్రాణమున్

నరాళి గావను

యజ్ఞంపు దేవు గొఱ్ఱెపై

నఘంబు వేయుడి

6 సత్కీర్తి స్తోత్ర ప్రేమల

నబాన భూమిని

సర్వత్ర దేవుడొందుగా

 

సద్బక్త పాళిచే