నూతన యెరూషలేం నా గృహము

 

నూతన యెరూషలేం నా గృహము 

ఎప్పుడు వెళ్లి నే చేరెదను  

రారాజు నగరమే ఆ పురము రమ్యమైన సీయోనే! 

దాని ఉన్నత వాస స్థలము  

చరణములు 

1.స్పటికమువలె బంగారు వీధులు  

ముత్యపు గుమ్మముల్ ఆ పట్టణముకు  

ధగధగ మెరుయును దానిలో వెలుగు  

దానిలో చేరుటే నా హృదయ వాంచ – నూతన 

2.క్రీస్తు యేసే మూలరాయిగాను  

అపోస్తులే పునాదుల రాళ్లగా కట్టిరి 

అమూల్య రత్నములతో అలంకరింపబడె 

ఆ రమ్య నగరమే నా నిత్యవాసం – నూతన 

౩.దుఃఖము వేదన కన్నీరే లేదు 

ఆ దేసమునందు మరణమే లేదు  

నా ప్రతి బాష్పబిందువు తుడుచున్  

నా దేవునితోనే కాపురముండెదన్– నూతన  

4.ఆ నగరములో ప్రకాశించుటకు  

సూర్యచంద్రులు దానిలో లేరు  

గొఱ్ఱెపిల్ల ప్రభుయేసే దానిలో దీపము  

పెండ్లికుమర్తెగా మహిమలో వసింతున్ – నూతన 

5. సీయోను సౌందర్యం ఆ నగర మహిమ  

సీయోనే శాశ్వత శోభాతిశయము  

ఆ దివ్య పురములో చేర్చుము త్వరగా 

ఆకాంక్షతో నేను కనిపెట్టి జీవింతున్ – నూతన