నూతనపరచుము దేవా నీ కార్యములు నాయెడలా

Lyrics 

నూతన పరచుము దేవా 

నీ కార్యములు నా యెడల (2) 

సంవత్సరాలెన్నో జరుగుచున్నను 

నూతనపరచుము నా సమస్తము (2) 

పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును 

నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును        ||నూతన|| 

 

శాశ్వతమైనది నీదు ప్రేమ 

ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) 

దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా 

నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)         ||పాతవి|| 

 

ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో 

నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) 

తరములలో ఇలా సంతోషకారణముగా 

నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)         ||పాతవి||