నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి

 

నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి 

నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావాలి 

నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదాయము నివ్వాలి 

నీవున్న రీతిగానే – వట్టి పాత్రగానే 

1. నీకున్న ధనధాన్యము అక్కరలేదు 

నీదు అధికారము అక్కరరాదు 

నీదు పైరూపము లెక్కలోనికి రాదు 

నీదు వాక్చాతుర్యము పనికిరాదు 

అ.ప. : నిన్ను నీవు తగ్గించుకొని – రిక్తునిగా చేసుకొని 

విరిగి నలిగిన హృదాయంతో దైవసన్నిధి చేరాలి 

2. నీకున్న జ్ఞానమంతా వెర్రితనము 

నీకున్న ఘనతవల్ల లేదే ఫలితము 

నీ గొప్ప పనులతో ఒరిగేది శూన్యము