నీ సిలువ శ్రమలు ధ్యానించాలని నీ సముఖములో తరించాలని

నీ సిలువ శ్రమలు ధ్యానించాలని నీ సముఖములో తరించాలని 

మాలిన్యమునకు దూరంగా – నీకిష్టమైన యాగంగా 

జీవితం మలచుకోవాలనే పవిత్ర సాధాన దీక్ష  

అ.ప. : ఇది సిలువ దీక్ష-స్వపరీక్ష 

1. మానవపాపపరిహారార్థం భువికేతెంచిన నీవు 

సిలువను మోసి మరణమునొంది నీపని ముగించినావు 

నా సిలువను నేనెత్తుకొని – నన్ను నేను తగ్గించుకొని 

నీ అడుగులలో నడవాలనే పవిత్ర సాధాన దీక్ష 

2. లోక పాపాలగూర్చిన బాధతో రక్తమాయె నీ స్వేదం 

గెత్సెమనెలో మోకాళ్ళపైన మ్రోగెను ప్రార్థననాదం 

నా పాపక్రియలకొరకై నే – పశ్చాత్తాప హృదయముతో 

ఆత్మీయ వసంతం పొందాలనే పవిత్ర సాధాన దీక్ష 

3. పరోపకారమే ఆహారంగా ఇలలో జీవించినావు 

ప్రేమ కలిగియుండుమని బోధించి మాదిరి చూపించినావు 

శత్రువుకై ప్రార్థించిన – అందరికి మేలు చేసిన 

నీ మనసు కలిగియుండాలనే పవిత్ర సాధాన దీక్ష