నీ సాక్ష్యం ఏది ?-నీ బలి అర్పణ ఏది?

నీ సాక్ష్యం ఏది ?-నీ బలి అర్పణ ఏది?(2) 

ప్రభు యేసు నంగీకరించి-నిద్రించెదవేల 

ప్రభు యేసు నంగీకరించి-జాగు చేసేదవేల 

మేల్కో-లెమ్ము(2)-రారమ్ము విశ్వాసి బి(1) 

1.అపోస్తలుల కాలములందు- ఉపద్రవముల ఒత్తిడిలో(2) 

అన్నింటి సహించుచు(2)-ఆత్మలాదాయము చేసిరి(1) {నీసాక్ష్యం} 

2.రాళ్లతో కొట్టబడిరి-రంపాలచే కోయబడిరి  

పరమ దర్శనమొంది -సువార్తను చాటించిరి {నీసాక్ష్యం} 

3. కొరడాతో కొట్టబడిరి -చేరసాలయందుంచబడిరి 

చెరసాల సంకెల్లును-వారి నాటంక పరచలేదు {నీసాక్ష్యం} 

4.సజీవ యాగముగ- ప్రభు సేవను జరిగించిరి  

సువార్త ప్రబలమాయెను-సంఘము-స్థాపించబడె {నీసాక్ష్యం} 

5.కోత విస్తాతరమెంతో- కోత కోయువారు కొందరే  

యేసునిన్ పిలచుచుండె- త్రోసి వేసేదవా ప్రభు పిలుపున్ {నీసాక్ష్యం} 

6.అర్పించేద నన్ను -ఆత్మ ప్రాణ శరీరముతో  

నా సిలువను ఎత్తుకొని-నిన్నే వెంబడింతు నేను.   |{నీసాక్ష్యం} 

****