నీ సల్లని సూపే ఓ యేసయ్యా

నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును మార్చింది మెస్సీయా  

నీ మెల్లని మాటే ఓ యేసయ్యానను సేదదీర్చింది మెస్సీయా  

 

1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా – తగ్గింపు నేర్పింది మెస్సీయా  

పరిశుద్ధ నీ నడత యేసయ్యా – మాదిరి నాకుంచింది మెస్సీయా  

 

2. నీవు కార్చిన రక్తం యేసయ్యా – నా పాపం కడిగింది మెస్సీయా  

నీవు పొందిన మరణం యేసయ్యా – నాకు జీవం పోసింది మెస్సీయా  

 

3. నీ దేహపు గాయం యేసయ్యా – స్వస్థత కలిగించింది మెస్సీయా  

నీ కలువరియాగం యేసయ్యా – కొత్తజన్మనిచ్చింది మెస్సీయా