నీ వైపు చూస్తూ నిన్నే సేవించనీ

నీ వైపు చూస్తూ నిన్నే సేవించనీ

నిన్ననుసరిస్తూ నీకై జీవించనీ

నీలోనే నను నిలిపి ఫలియించనీ

నీ సేవలో గడిపి తరియించనీ

1. నీ సహవాసము ఆనందమయము

నీ సన్నిధిలో లేదే భయము

నీ ఆలోచన నాకెంతో ప్రియము

నీయందే నా అతిశయము

నీ కృపకంటే మించినదే లేదయ్యా

నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా

2. నీ చేతికార్యము ఆశ్చర్యకరము

నీ నీతివాక్యము ఎంతో స్థిరము

నీ కనికరము ధరణికి వరము

నీ ప్రేమ నిలుచు నిరంతరము

3. నీ జీవమార్గము చేర్చును స్వర్గము

నీ కుడిహస్తము కూర్చును సౌఖ్యము

నీ నామమందే రక్షణ భాగ్యము

 

నీ దీవెనొందే బ్రతుకు ధన్యము