నీ వాక్యమే నా పాదాలకు దీపము

నీ వాక్యమే నా పాదాలకు దీపము

నీ చిత్తమే నా జీవిత గమనము (2)

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన దేవా (2)

వందనాలయ్యా నీకే వేలకొలది వందనాలయ్యా

స్తోత్రాలయ్యా నీకే కోట్లకొలది స్తోత్రాలయ్యా

 

నీ భారము నాపై వేయుము

ఈ కార్యము నే జరిగింతును (2)

నా కృప నీకు చాలును

అని వాగ్దానమిచ్చావయ్యా (2)        ||వందనాలయ్యా||

 

పర్వతములు తొలగిననూ

మెట్టలు తత్తరిల్లిననూ (2)

నా కృప నిన్ను వీడదు

 

అని అభయాన్ని ఇచ్చావయ్యా (2)     ||వందనాలయ్యా||