నీ వాక్యమే నన్ను బ్రతికించెను

నీ వాక్యమే నన్ను బ్రతికించెను

బాధలలో నెమ్మదినిచ్చెను (2)

కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా

వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2)      ||నీ వాక్యమే||

 

జిగటగల ఊభినుండి లేవనెత్తెను

సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)

నా పాదములకు దీపమాయెను (2)

సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)       ||నీ వాక్యమే||

 

శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై

యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)

అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)

ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)       ||నీ వాక్యమే||

 

పాలవంటిది జుంటి తేనె వంటిది

నా జిహ్వకు మహా మధురమైనది (2)

మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)

 

రత్న రాసులకన్నా కోరతగినది (2)           ||నీ వాక్యమే||