నీ రక్త ధారలే – మా జీవనాధారాము

నీ రక్త ధారలే మా జీవనాధారాము

నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము

ఓ సిల్వ రాజ క్రీస్తు రాజ

నీతి రాజ యేసు రాజ (2)

 

మాలోన పలికించు జీవన రాగము నీ ఆర్తనాదములే

మాలోన వెలిగించు జీవన జ్యోతులు నీ సిల్వ రూపమే        ||ఓ సిల్వ||

 

మమ్మును నడిపించు పరలోకమునకు నీ సత్య వాక్యమే

పాపపు చీకట్లు పారద్రోలెను నీ నీతి ప్రభావమే       ||ఓ సిల్వ||

 

నీ సిలువ మరణము మనుజాళికంత కలిగించె రక్షణ

 

నీ మరణ విజయము జగమందు వెలుగొందు క్రైస్తవ విజయమై        ||ఓ సిల్వ||