నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్

నీ రక్తమే నా బలము (2)

 

నీ రక్త ధారలే ఇల

పాపికాశ్రయంబిచ్చును (2)

పరిశుద్ధ తండ్రి పాపిని

కడిగి పవిత్ర పరచుము (2)             ||నీ రక్తమే||

 

నశించు వారికి నీ సిలువ

వెర్రితనముగ నున్నది (2)

రక్షింపబడుచున్న పాపికి

దేవుని శక్తియై యున్నది (2)          ||నీ రక్తమే||

 

నీ సిల్వలో కార్చినట్టి

విలువైన రక్తముచే (2)

పాప విముక్తి చేసితివి

పరిశుద్ధ దేవ తనయుడా (2)          ||నీ రక్తమే||

 

పంది వలె పొర్లిన నన్ను

కుక్క వలె తిరిగిన నన్ను (2)

ప్రేమతో చేర్చుకొంటివి

ప్రేమార్హ నీకే స్తోత్రము (2)               ||నీ రక్తమే||

 

నన్ను వెంబడించు సైతానున్

నన్ను బెదరించు సైతానున్ (2)

దునుమాడేది నీ రక్తమే

దహించేది నీ రక్తమే (2)                 ||నీ రక్తమే||

 

స్తుతి మహిమ ఘనతయు

యుగయుగంబులకును (2)

స్తుతి పాత్ర నీకే చెల్లును

 

స్తోత్రార్హుడా నీకే తగును (2)            ||నీ రక్తమే||